బ్రెజిలియన్ సింగర్ ఐరెస్ ససాకి (35) చనిపోయారు. బ్రెజిల్‌లోని పారా రీజియన్ సాలినోపోలిస్‌లో ఇటీవల ఆయన మ్యూజిక్ కాన్సెర్ట్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో స్టేజిపై ఉన్న ఆయనను వర్షంలో తడిచిన ఓ అభిమాని కౌగలించుకున్నారు. ఆ సమయంలో సమీపంలోని కరెంట్ వైర్ తాకారు. కరెంట్ షాక్ కొట్టడంతో స్టేజిపైనే ఆయన కుప్పకూలి చనిపోయారు. 11 నెలల క్రితమే ఆయనకు పెళ్లైంది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.