ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను టర్కీ నిషేధించింది. ఇన్స్టాగ్రామ్ నిషేధానికి కారణాన్ని టర్కీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత అతనికి సంబంధించిన కంటెంట్‌ను తీసివేయడానికి టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ని బ్లాక్ చేసిందని చాలా నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పై ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో స్పష్టత లేదు.