టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.