హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో 24గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. లీకేజీ సమస్యల కారణంగా అక్టోబర్ 24 తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 25 ఉదయం 6 గంటల వరకు నగరంలో చాలా ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు. బండ్లగూడ, లాలాపేట్, శంషాబాద్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.