Homeజిల్లా వార్తలుపేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్

పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మేనూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదు గురిని అరెస్ట్ చేసినట్లు మద్నూర్ ఎస్సై విజయ్ కొండ తెలిపారు. మేనూర్ గ్రామ శివారులో పేకాడుతున్నట్టు సమాచారం రావడంతో మంగళవారం తనిఖీలు జరిపారు. ఐదుగురిని పట్టుకొని వారి వద్ద నుండి పేకాట కార్డులు మరియు 9650/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Recent

- Advertisment -spot_img