లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సూపర్ స్టార్‌కి మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి హెచ్చరించారు. ఈ పాట రాసిన వ్యక్తి నెల రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. మరోసారి పాటలు రాయలేనివిధంగా ఉంటుందని గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. సల్మాన్‌కి దమ్ముంటే వారిని కాపాడమని వారు హెచ్చరించారు. వీరిపై వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.