ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను చిత్రబృందం రిలీజ్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ లో అల్లుఅర్జున్ యాక్టింగ్ ఇరగదీసాడు. సుకుమార్ తన మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కి థియేటర్లో ఫాన్స్ మాస్ సెలెబ్రేషన్స్ చేస్తారు. ఈ ట్రైలర్ ఈవెంట్ ని పాట్నా లోని గాంధీ మైదాన్ లో భారీ ఎత్తున చిత్రబృందం నిర్వహించింది. ఈ ఈవెంటుకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన హాజరుయ్యారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాయి.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.