ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఐటివలె చెన్నైలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ కి నిర్మాతలకి గొడవలు జరిగాయి అని తెలిసిన వార్తే…కానీ సినిమా నిర్మాతలు మాత్రం దేవిశ్రీప్రసాద్ తో మాకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పేసారు. అయితే ఈరోజు ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. అయితే కార్యక్రమానికి దేవిశ్రీప్రసాద్ వస్తారా లేదా అనే మరి కాసేపటిలో తెలియనుంది.