ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర రాజకీయల్లో భాగంగా విశాఖ కంటైనర్ లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందని, రాష్ట్రం గంజాయి, డగ్స్ అడ్డాగా మారిపోయిందని, ఓటర్లను మోసగించేందుకు పోలింగ్ కు నెలన్నర ముందు పెద్దఎత్తున దుష్ప్రచారం చేసాడు అని విజయసాయి రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ కంటైనర్ లో డ్రగ్స్ లేవని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ ప్రకటించింది. బ్రెజిల్ అధ్యక్షుడికు నాకు లింకు పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చకుల మీడియా ఇప్పుడు ఏం సమాదానం చెప్తారు? అని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.