లోన్ యాప్ వేధింపులు భరించలేక పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం యువకుడి ఫోటోలను మార్పింగ్లు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఆ మార్ఫింగ్ ఫోటోలను స్నేహితులకు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర(21) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.