సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరై విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ తరపున కోర్టులో వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ఈ కేసును వాదించిన ఆయన గంటకు రూ.5 లక్షలు ఛార్జ్ చేస్తారట. ఈయన లాయర్ మాత్రమే కాదు ఘాజీ, క్షణం, ఆచార్య వంటి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.