Homeసినిమా#KGF2 : రికార్డులు తిరగరాస్తున్న కె.జి.యఫ్ 2

#KGF2 : రికార్డులు తిరగరాస్తున్న కె.జి.యఫ్ 2

Indian film ‘KGF’ the new wave is generated. Sandilvud small film industry came from the south, “KGF Chapter 1” film lovers across the country tied. It rained cassava at the box office.

ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’.

ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఆసక్తి, ఆత్రుత ఏ స్థాయిలో ఉందో టీజర్‌కు వస్తోన్న స్పందన చూస్తుంటే అర్థమవుతోంది.

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ మొదట ప్రకటించింది.

అయితే, టీజర్ లీక్ కావడంతో గురువారం (జనవరి 7న) రాత్రే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ రికార్డుల వర్షం కురిపించింది. విడుదలైన 24 గంటల లోపలే గతంలో ఏ సినిమా టీజర్‌కు రానన్ని లైకులు, వ్యూస్ వచ్చాయి.

ఇండియన్ సినిమాలోనే అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో అత్యధికంగా లైక్ చేసిన టీజర్‌గా ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ నిలిచింది.

టీజర్ విడుదలైన 10 గంటల 30 నిమిషాలకు లైకుల సంఖ్య 2 మిలియన్ దాటింది.

నిజానికి ఇదో ప్రభంజనం. సౌత్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ టీజర్‌కు కూడా ఈ స్థాయిలో లైకులు రాలేదు.

అంతెందుకు, ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘RRR’ టీజర్లకు కూడా ఇన్ని లైకులు రాలేదు. దీన్ని బట్టి ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ హైప్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

ప్రస్తుతం ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ టీజర్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కలుపుకుని 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

యూట్యూబ్‌లో అయితే టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో అయితే 13 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ దాటాయి.

2.5 మిలియన్ లైకులు వచ్చాయి. మొత్తం మీద ఈ పుట్టినరోజును యశ్ మంచి జోష్‌తో జరుపుకుంటున్నారు.

ఇక ఆయన ఫ్యాన్స్ అయితే ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. రాఖీ భాయ్‌ని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent

- Advertisment -spot_img