The Iraqi capital, Baghdad, was rocked by two suicide bombings. The bomber struck shortly after noon in front of a police station in central Baghdad, killing at least 32 people. More than 110 people were injured.
రెండు ఆత్మాహుతి బాంబు దాడులతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ వణికి పోయింది.
సెంట్రల్ బాగ్దాద్‌లోని నిత్యం రద్దీగా ఉండే ‘బాబ్ అల్ షార్కి’లో జరిగిన ఈ రెండు వరుస పేలుళ్లలో కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
110 మందికి పైగా గాయాల పాలయ్యారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రుల దేహాలతో ఘటనాస్థలి హృదయవిదారకంగా మారింది.
ఈ పేలుళ్లకు ఇంతవరకు ఏ సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. కానీ, అధికారులు మాత్రం ఇది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థ పనేనని ధ్రువీకరించారు.
ఆర్థిక సంక్షోభంతో పాటు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో రాజకీయంగా దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తి మొదట, మార్కెట్ మధ్య నిల్చుని తనకు ఆరోగ్యం బాలేదంటూ గట్టిగా అరిచాడని, దాంతో అందరూ ఆయన చుట్టూ మూగారని, అదే సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ తహసిన్ అల్ ఖఫాజీ వివరించారు.
ఆ తరువాత కాసేపటికే మరో వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్ చేసిన దారుణమిదని అన్నారు.