Homeలైఫ్‌స్టైల్‌పిల్లల్లో కరోనా గుర్తించండి ఇలా..

పిల్లల్లో కరోనా గుర్తించండి ఇలా..

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ( corona ) సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. వ‌రుస‌గా ఏడో రోజు 2 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.

మొద‌టి ద‌శ‌లో చిన్నారుల‌పై క‌రోనా పెద్ద‌గా ప్ర‌భావం చూపించలేదు. కానీ సెకండ్ వేవ్ ( second wave )‌లో పంజా విసురుతోంది.

ముఖ్యంగా చిన్నారులు, 18 ఏండ్ల వయసులోపు ఉన్నవారికి సంబంధించి క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

మొద‌టి ద‌శ‌లో చిన్నారుల్లో ల‌క్ష‌ణాలు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఇప్పుడు మాత్రం కోవిడ్ ల‌క్షణాలు క‌నిపిస్తున్నాయి.

ముఖ్యంగా కొత్త‌గా పుట్టుకొస్తున్న కరోనా వైరస్‌ మ్యుటేష‌న్ల ( corona new variants ) వ‌ల్ల 18 ఏళ్ల‌లోపు ‌వారికి కూడా క‌రోనా సోకుతుందని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పిల్ల‌ల్లో క‌నిపించే corona ల‌క్ష‌ణాలేంటి

చిన్నారుల్లో సాధార‌ణంగా జ్వ‌రం, గొంతునొప్పి, పొడిద‌గ్గు ఉంటే కరోనా అయి ఉండొచ్చని అనుమానించాలి.

కొంద‌రిలో వాంతులు, విరేచ‌నాలు, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి ల‌క్ష‌ణాలు కూడా ఉంటున్నాయి.

అయితే సెకండ్ వేవ్‌లో చిన్నారుల్లో కొత్త ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.

క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌టం, చ‌ర్మంపై ద‌ద్దుర్లు, సృహ కోల్పోవ‌డం, గోర్లు నీలం రంగులోకి మారడం జ‌రుగుతోంది. ‌

కాబ‌ట్టి ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కరోనా టెస్ట్ చేపించ‌డం ఉత్త‌మ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

corona సోకిన త‌ల్లి.. బిడ్డ‌కు పాలివ్వొచ్చా

కొద్దిపాటి ల‌క్ష‌ణాలుంటే మాత్రం బిడ్డ‌ను దగ్గరికి తీసుకోవ‌చ్చు. మాస్కుతో పాటు గ్లౌజులు పెట్టుకొని బిడ్డ‌కు పాలు ఇవ్వొచ్చు.

ముఖ్యంగా త‌ల్లిపాల నుంచి పిల్ల‌ల‌కు వైర‌స్ సోకే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

Recent

- Advertisment -spot_img