సిగరెట్ తాగే వారు, శాఖాహారులు, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంట.
ఈ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సెరో సర్వే వెల్లడించింది.
సార్స్-కొవ్-2 కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉండటం, కరోనా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్, దాని తటస్థీకరణ సామర్థ్యాన్ని సీఎస్ఐఆర్ నిర్వహించిన పాన్-ఇండియా సెరోసర్వే అధ్యయనం చేసింది.
140 మంది వైద్యులు, శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయనం..
పట్టణ ,సెమీ అర్బన్ ప్రాంతాల్లో 40 కి పైగా సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు, కేంద్రాల పరిధిలోని 10,427 వయోజనులను, వారి కుటుంబ సభ్యులను పరిశీలించింది.
వీరంతా స్వచ్ఛందంగా అధ్యయనంలో పాల్గొన్నట్లు సీఎస్ఐఆర్ తెలిపింది.
కొవిడ్-19 శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ, మ్యూకస్ ఉత్పత్తిని పెంచడంలో దాని పాత్ర కారణంగా ధూమపానం మొదటి రక్షణ వరుసగా పనిచేస్తుందని సర్వే సూచించింది.
అయినప్పటికీ, కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌పై ధూమపానం, నికోటిన్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కేంద్రీకృత యాంత్రిక అధ్యయనాల అవసరం ఉన్నదని ఈ పరిశోధన హెచ్చరించింది.
అయితే, “ధూమపానం ఆరోగ్యానికి తీవ్ర హానికరం, పలు వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నది. ఈ పరిశీలనను ఆమోదంగా తీసుకోకూడదు” అని పరిశోధకులు నొక్కి చెప్పారు.
ఇక, బ్లడ్ గ్రూప్ ‘ఓ’ ఉన్నవారు కూడా ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం తక్కువగా ఉన్నదని, బీ, ఏబీ రక్తం రకాలు ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటాయని సర్వేలో తేలింది.
బ్లడ్ గ్రూప్ రకం ఏబీకి సెరో-పాజిటివిటీ అత్యధికంగా ఉంటుందని, బీ గ్రూప్ తర్వాత బ్లడ్ గ్రూప్ ఓ తక్కువ పాజిటివిటీ రేటుతో సంబంధం కలిగి ఉంటుందని తేలింది.
కొవిడ్-19 పాజిటివ్‌కు అమెరికాలో 7,000 మందికి పైగా పరీక్షించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలనే కనుగొన్నది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 1.3 శాతం మంది మాత్రమే ధూమపానం చేస్తున్నారని, సీడీసీ నివేదికతో పోల్చితే మొత్తం అమెరికన్లలో 14 శాతం మంది ధూమపానం చేస్తున్న వారున్నారు.
అదేవిధంగా, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ విద్యావేత్తలు యూకే, చైనా, ఫ్రాన్స్, యూఎస్ అంతటా 28 పరిశోధనా పత్రాలను పరిశీలించగా.. ఆసుపత్రి రోగుల్లో ధూమపానం చేసేవారి నిష్పత్తి ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నదని కనుగొన్నారు.
యూకేలో కొవిడ్-19 రోగులలో ధూమపానం చేసేవారి నిష్పత్తి కేవలం ఐదు శాతం మాత్రమే.
ఇది జాతీయ రేటు 14.4 శాతంలో మూడవ వంతు.
ఫ్రాన్స్‌లో ఈ రేటు నాలుగు రెట్లు తక్కువగా ఉన్నది.
చైనాలో అక్కడి జనాభాలో సగానికి పైగా క్రమం తప్పకుండా సిగరెట్లు తాగుతున్న వారు ఉన్నప్పటికీ 3.8 శాతం మంది రోగులు మాత్రమే ధూమపానం చేస్తున్నారని ఒక అధ్యయనం పేర్కొన్నది.