Homeవిద్య & ఉద్యోగంతెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం - 8

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 8

9 అక్తోబర్‌ 2009:

ఫ్రీజోన్‌ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు. హైదరాబాద్‌ 6వ జోన్‌లో భాగమైనప్పటికి రాష్ట్రపతి ఉత్తర్వు లోని 14ఎఫ్‌ నిబంధన అనుసరించి పోలీస్‌ అధికారుల నియామకాల విషయంలో మాత్రం ఫ్రీజోన్‌గా పరిగణించాలని తీర్పునిచ్చింది.

11 అక్టొబర్‌ 2009:

ఫ్రిజోన్‌ పై సుప్రిం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎస్టిఓల సంఘం ఆధ్వర్యంలో టిఎన్‌జివో భవన్‌ నుంచి ఛలో అసెంప్లీ కార్యక్రమం, గన్‌ పార్కువద్ద  ధర్నా.

18 అక్టోబర్‌ 2009:

ఫ్రజోన్‌ పై సుప్రం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎస్టీఓల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా.

21 నవంబర్‌ 2009:

సిద్ది పేటలో తెలంగాణ ఉద్యోగుల గర్జన, భారి బహిరంగ సభ, కెసిఆర్‌ ఆమరణదీక్ష ప్రకటన.

28 నవంబర్‌ 2009 :

నిరహారదిక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుండి కరీంనగర్‌ బయలుదెరివెళ్లిన కె.సి.ఆర్‌.

కరీంనగర్‌లోని టిఆర్‌ఎస్‌ ఆఫీసు (తెలంగాణ భవన్‌)ను చుట్టుముట్టెందుకు భారీగా పోలీసుల మోహరింపు, ప్రతిఘటించిన తెలంగాణ ఉద్యమకారులు. పలువురి ఆత్మహత్యా ప్రయత్నం. రాత్రంతా హైడ్రామా …

20 నవంబర్‌ 2009 :

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమై కరీంనగర్‌ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు అల్గునూరువద్ద అరెస్టు చేసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త

పరిస్థితులు ఎర్పడ్డాయి. సిద్ధి పెటలోని దిక్షాశిబిరం వద్ద ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావ కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం.

ఎల్‌.బి. నగర్‌వద్ద శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నం. తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు. కెసిఆర్‌ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు.

30 నవంబర్‌ 2009 :

ఖమ్మం జిల్లా జైల్‌నుంచి కెసిఆర్‌ను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కెసిఆర్‌ ఆమరణదిక్షకు మద్దతుగా, తెలంగాణ రాహ్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల పెన్‌డౌన్‌.

01 డిసెంబర్‌ 2009;

నిజామాబాద్‌ జిల్లాలో కానిస్టైబుల్‌ కిష్టయ్య సెల్‌ టవర్‌పైకి ఎక్కి రివాల్వర్‌తో కాల్చుకుని మృతి. తన చావుతోనైనా తెలంగాణ ప్రకటించాలని లెఖ.

సెల్‌టవర్‌పై నుండి దాదాపు రెండు గంటలపాటు తెలంగాణ నినాదాలు. వేలాదిమంది ప్రజలు, మీడియా సమక్షంలోనే ఆత్మహత్య. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరునిగా చరిత్రలో నిలిచిపోయిన కానిస్టైబుల్‌ కిష్టయ్య.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపటత్రిలో కెసిఆర్‌ జ్యూస్‌ తాగి దీక్షను విరమించినట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం.

నిరసనగా భగ్గుమన్న ఉస్మా నియా క్యాంపస్‌. ఉస్మానియా క్యాంపస్‌తో పాటు అనేక చోట్ల పెద్ద ఎత్తున కెసిఆర్‌ దిష్టిబొమ్మల దహనం.

ఆసుపత్రిలోనే కెసిఆర్‌ తన దిక్షను కొనసాగిస్తున్నట్లు టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతల ప్రకటన.

03 డిసెంబర్‌ 2009;

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీకాంతాచారి మృతి. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి కేసిఆర్‌ను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిన పోలీసులు.

05 డిసెంబర్‌ 2009;

అసెంల్లీలో తెలంగాణపై చర్చ. కెసిఆర్‌ దీక్షను విరమింపజేయాలని వినతి.

7 డిసెంబర్‌ 2009:

ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన అఖీలపక్ష సమావేశం, తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్న అన్ని రాజకీయ పార్టిల అగ్రనేతలు.

9 డిసెంబర్‌ 2009:

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర హోంమంత్రి చిదంబరం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రోశయ్యకు సూచన.

తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఉదయం నుండి నాయంత్రం వరకు తెలంగాణ మెథావులు, (రక్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, కులసంఘాల ప్రతినిధులతో సుధిర్హ సమావెశం.

కెసిఆర్‌ దీక్షను విరమింపజేయాలని సూచన. అదెరోజు అర్ధరాత్రి నిరాహార దీక్ష విరమించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.

10 డిసెంబర్‌ 2009:

రాష్ట్రంలో మారిన రాజకీయం, చిదంబరం ప్రకటనను వ్యతిరెకించిన సీమాంధ్ర నేతలు, మూకుమ్మడిగా రాజీనామాల సమర్పణ.

11 డిసెంబర్‌ 2009;

సీమాంధ్రలో అక్కడి నాయకుల ప్రోద్భలంతో కృత్రిమ ఉద్యమం ప్రారంభం. లగడపాటి రాజగోపాల్‌ నాయకత్వంలో పలు కార్యక్రమాలు.

23 డిసెంబర్‌ 2009;

చిదంబరం మరో ప్రకటన. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భీన్న వైఖరులు తీసుకున్న కారణంగా విసృత సంప్రదింపులు జరవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటన.

24 డిసెంబర్‌ 2009;

చిదంబరం ప్రకటనపై తెలంగాణలో ఆగ్రహావేశాలు, బంద్‌లు, కాంగ్రెస్‌,  టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపి, వివిధ తెలంగాణ ప్రజా సంఘాలు, సంస్థలతో తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి (జేఏసి) ఏర్పాటు. తెలంగాణ విద్యావంతుల వదిక అధ్యక్షుడు

ప్రొఫెసర్‌ యం. కోదండరామ్‌ జేయేసి కన్వీనర్‌గా ఏకగ్రీవంగా నియామకం.

25 డిసెంబర్‌ 2009;

బంజారాహిల్స్‌ లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో జేయేసీ స్ట్‌రింగ్‌ కమిటీ తొలి సమావేశం. ఉద్యమ కార్యాచరణ ప్రకటన.

80 డిసెంబర్‌ 2009;

చిదంబరం మూడో ప్రకటన. జనవరి 5న ఢిల్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది గుర్తింపు పొందిన కాంగ్రేస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌., బి.జె.పి., సి.పి.ఐ., సిపి ఐ.(యం), ఎం.ఐ.ఎం., లోక్‌సత్తా రాజకీయ పార్టీలకు పిలుపు.

తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి (తెలంగాణ జేయేసీ) విస్ఫతస్థాయి సమావేశం మొట్టమొదటిసారిగా 25 డిసెంబర్‌ 2009 (శుక్రవారం) రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు బంజారహిల్స్‌

రోడ్‌నెంబర్‌14లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో జేయేసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యం. కోదండరామ్‌ అధ్యక్షతన జరిగింది.

ఉద్యోగ సంఘాల జేయేసీ నాయకులు వి. శ్రీనివాస్‌గౌడ్‌ నాయకులను వేదిక మీదికి ఆహ్వానించగా, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శి పిట్టల రవిందర్‌ సమావెశాన్ని సమన్వయపరిచారు.

జేయేసీ మొదటి సమావేశంలో నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్థూలంగా.

 జానారెడ్డి

జేయేసీ కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవడానికి ప్రాతిపదికను రూపొందించుకోవాలి.

రాజకీయ పాద్దిల కార్యక్రమాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కల్సి చర్చించుకోవల్సి ఉంది. 

పరస్పర సహకారం, అవగాహనతో ముందుకుపోదాం. ప్రత్వక్షకార్యాచరణ మన అందరి లక్ష్యం కావాలి.

కే.సీ.ఆర్‌.

తెలంగాణ రాష్ట నాధన ఉద్యమానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలి.

జేయేసీ ఏర్పాటు ద్వారా రాజకీయపార్టీలన్నీ తమతమ జెండాలను, ఎజెందాలను పక్కకుపెట్ట ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇవ్వగలిగాము. ఇది తెలంగాణ విజయానికి తొలిమెట్టు.

మన లక్ష్యం ఢిల్లీ మెదలువంచి తెలంగాణ సాధించుకోవడం. తెలంగాణ పల్లెలను కదిలించాలి. విద్యార్థులమీద జరుగుతున్న అణచివెతను ఎదిరించాలి.

ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేయాలి. నిర్మాణ కమిటీ రూపొందించుకోవాలి. అన్ని సంఘాలను జేయేసిలోకి సమన్వయం చేసుకోవాలి.

నాగం జనార్ధనరెడ్డి పై ఉన్మానియా క్యాంపస్‌లో జరిగిన దాదిని ఖందిద్దాం. తెలుగుదేశం పార్టికి చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు జేయేసీలోకి రావాలని కోరుదాం.

కమ్యూనిస్టు పార్టిలను కూడా పోరాటంలో కలిసి రావాలని కోరుదాం. పార్టీలకు అతీతంగా అందరి సహకారం తీసుకుందాం.

కులసంఘాలు, ప్రజాసంఘాలు తమ సూచనలు అందించంది.

సి. హెచ్‌. విద్యాసాగర్‌ రావు

ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ జేయేసీతో కలిసి పనిచేస్తుంది. ప్రభుత్వం అణచివేతకు వ్యూహరచన చెస్తున్నది.

సమాజానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది. తెలంగాణ కాంగైస్‌ ప్రాంత నాయకుల వాత్ర ప్రధానమైనది.

ప్రత్వేకతెలంగాణ రాష్టం ఏర్పాటైనతర్వాత మాత్రమే మళ్లీ ఓట్లు అడగాలి. ఆచరణ సాధ్యమైన కార్యాచరణను మాత్రమె రూపొందించుకోవాలి. విద్యార్థుల్లో ఆవేశం పెరుగుతున్నది.

విద్యార్థులను ఏడురోజులపాటు ఎంగేజ్‌ చేద్దాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరగాల్సిన పరిణా మాలను వివరించాలి.

ప్రొఫెసర్‌ రమా ఎస్‌. మెల్కొటె

తెలంగాణలో ఏ పార్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మూడు ముఖ్యమైన విధానాలు అమలు చేయాలి.

భూసంస్కరణలు అమలు జరగాలి. భూమి పంపిణీ, వ్యవసాయం అభివృద్ధి తదితర విషయాలు గ్రహించాలి.

ఉచిత విద్యావిధానం అమలు జరపాలి. వైద్య, ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలి.

రాబోయే తెలంగాణ ఎట్లా ఉంటుందో ప్రజలకు వివరించాలి. తెలంగాణ ఒక సెక్యులర్‌ రాష్టంగా ఉండాలి.

పౌరసమాజం పాత్ర చాలా ముఖ్యమైనది. తెలంగాణ చరిత్రపైన ఆంధ్రావ్రాంత ప్రజలకు అవగాహనలేదు.

తెలంగాణ పట్ల ఆంధ్రాప్రాంతంలో అవగాహన కల్పించాలి.

రాజేందర్‌ రెడ్డి (న్యాయవాదుల జేయేసీ)

తెలంగాణ జేయేసీ చేపట్టే కార్యక్రమాలన్నింటికీ మద్దతు ఇస్తాం.

బి.వి. మోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ)

ఉద్యోగులు, ఉవాధ్యాయులు, కార్మికులు లేకుండా ఉద్యమం ముందుకుపోదు. జేయేసితో ఉద్యమంలో కలిసి పనిచేయాలని పి. ఆర్‌. టి. యులో నిర్ణయం తీసుకున్నాం.

వేయేసీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ కార్యక్రమాలు ఉండాలి. ఢిల్లీలో కూడా కదలికను తీసుకురావాలి. నాయకులు మోసం చేయకుండా చూసుకోవాలి.

రత్నమాల

తెలంగాణ కోసం మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. జిల్లా స్థాయిలో మహిళా జేయేసీ కమిటీలను ఏర్పాటు చేస్తాం.

రవి పులి (ఎన్నారై జేయెసీ)

మేము అమెరికాలో ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల బాధలు మాకు తెలుసు. అందుకే తెలంగాణ ఎన్నారై బేయేసీ ఏర్పాటు చేసాం. అయినా ఆంధ్రా ప్రాంత ప్రజలతో మాకు వైరంలేదు.

మధురెడ్ది (తెలంగాణ డెవెలప్‌మెంట్‌ ఫోరం -టిడిఎఫ్‌)

కల్పకుంట్ల చంద్రశేఖర్‌రావుగారు ఆమరణ దీక్షచేసి ఉద్యమానికి ఊపునిచ్చారు. ‘ఖాస్ట్‌ట్రాక్‌ దెవెలప్‌మెంట్‌ మోద్స్‌’ను తెలంగాణలో అమలు చెయాలి. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కృషి చేద్దాం.

దాసోజు శ్రావణ్‌కుమార్‌ (తెలంగాణ పీఆర్పీ)

Educate and stuggle  ఇప్పుడు జరగాల్సి ఉన్నది. తెలంగాణ వస్తె లాభాలేమిటో ప్రజలకు వివరించాలి.

కళాబ్బందాలను రంగంలోకి దింపాలి.  చిన్న  రాష్ట్రాల ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటైతే అన్ని

రంగాల్లో జరిగే అభివృద్ధిని ప్రచారం చేయాలి. సమైక్వాంధ్ర భావన వెనుకఉిన్న కుట్రలను తిప్పికొట్టాలి. సహాయ నిరాకరణ

లాంటి కార్య క్రమాలు రూపొందించాలి. కార్మికసంఘాలను కలుపుకోవాలి

మల్లేపల్లి లక్ష్మయ్య (సినియర్‌ జర్నలిస్టు)

తెలంగాణకు అడ్డు ఎవరు? వ్యావార, వాణిజ్య వరాలు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఉద్యమాలు జరుపుతున్నారు.

ఆంధ్రా ఉత్పత్తులను నిషెధించాలి. ట్రాన్స్‌పోర్టు, ఖాస్ట్‌ఫుద్‌, సినిమాలను బహిష్మరించాలి. హైదరాబాద్‌లో స్లమ్స్‌ను పూర్తిగా విస్మరించాం.

వాళ్లను ఆర్గనైజ్‌ చెయాలి. విద్యార్థి, యువకులను సమీకరించి గ్రామానికి ఐదుగురు చొప్పున పంపిద్దాం.

జేయేసీ ఇచ్చే కార్యక్రమాలను అమలు చేయడానికి వీరు పనిచేయాలి.

ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం)

ఆత్మహత్యలు వద్దని జేయేసీ తరఫున అన్నిపార్దిలు, సంఘాలు కలిసి ఒక ఉమ్మడి విజ్ఞప్తిని విడుదల చేయాలి.

అమరుల పేరిట స్మారకస్తూపాలు నిర్మించాలి. ఆమోద యోగ్యం, ఆచరణనాధ్యం అయ్యే కార్యక్రమాలనె రూపొందించుకోవాలి.

మధుయాష్కి గౌడ్‌ (ఎం.పి)

భారతదేశం మొత్తంలో తెలంగాణ మినహా మరోచర్చ లేదు. పోరాటం ఈ న్ధాయికి రావడానికి కారణం కేసీఆర్‌ గారు. ఉద్యమంలో కలిసిరాకపోయినా ఫర్వాలిదుగానీ, ఉద్యమానికి ద్రోహం చెయకండి.

బందిపోటులాగా వారిపోయివచ్చిన ఆంధ్రావాళ్లకు రహస్యంగా సహకరిస్తారా? చిదంబరం ప్రకటన వచ్చిన వెంటనె ఆంధ్రా ప్రజల్లో స్పందన లేదు. ఒకరోజు గడిచిన తర్వాత మాత్రమె దబ్బులు పంచి ఉత్తుత్తి ఉద్యమానికి తెరలేపారు.

తెలంగాణ ప్రజాబలం ముందు మి ధనబలం పనికిరాదు. తెలంగాణ వస్తే ఆంధ్రాకు నీళ్లురావని, ఉద్యోగాలు రావని రెచ్చగొట్టారు.

మీడియా సహకారంతో అధిష్టానాన్ని తప్పుదోపపట్టించారు. అక్కడ కౌగిలించు కుంటున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు.

కసీసం ఇక్కద మనం చేతులు కలపాలి. పిడికిళ్లు బిగించాలి. ఇంటీదొంగలను గుర్తుపట్టాలి. రాష్టంలో ప్రభుత్వం ఉందదు.

కేంద్రంలో కదలిక ఉన్నది. రాష్ట్ర ఎర్పాటు మాత్రమె తెలంగాణ సమస్యలకు పరిష్కారం. తెలంగాణ జేయేసికి అసలైన ముగింపు తెలంగాణ ఏర్పాటు తర్వాతనే!

కె.సి.ఆర్‌.

మంత్రులందరూ రాజీనామాలు చెసిన తర్వాత కూడా ఈ రాష్టంలో ప్రభుత్వం ఎట్లా ఉన్నట్లు!? ఈ రాష్టంలో ప్రస్తుతం రాజ్యాంగ సంక్షోభం నెలకొనిఉన్నది.

తొమ్మిదవ తేదినాటి ప్రకటనకే కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని తీవ్రస్థాయిలో డిమాండు చేద్దాం.

విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులను రానివ్వవద్దని ముఖ్యమంత్రిని, హోంమంత్రిని అఖిలపక్షం కలిసి కోరుదాం. జేయేసీలో పటిష్టమైన నిర్ణయాలు జరగాలి.

తూ. చా.తప్పకుండా అవి అమలు జరగాలి. ఇందుకు మేథావుల కమిటి, ఎర్పాటు చేసుకుందాం. మంగళవారం (డిసెంబర్‌ 29) నుండి నిరవధిక బంద్‌ ప్రకటిద్దాం.

ఆర్‌. దామెదర్‌రెడ్డి (కాంగ్రెస్‌ ఎమ్మెల్యే)

జేయేసీని పటిష్టంగా నిర్మించుకోవాలి. పార్టిలమధ్య, నాయకులమధ్య సమన్వయం జరగాలి. నాలుగుకోట్ల మంది ప్రజలను సమన్వయం చేయాలి.

సిద్ధాంతాలు పక్కకు పెట్టాలి. ఇది సమిష్టి నాయకత్వం. ప్రజాసంఘాల సూచనలు, సలహాలతో ముందుకు పోవాలి.

త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. ఆందోళన మాత్రమె సరిపోదు. బాధ్యతగా ముందుకు పోవాలి. ఉద్యమాలను కొనసాగించాలి.

గ్రామాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగించాలి. అవసరమైతే నాలుగుకోట్ల మందిని హైదరాబాద్‌కు తరలించి దిగ్భంధంచేయాలి.

ఉపేందర్‌ (ఓయూ జేయేసీ)

కొంతమంది రాజకీయ నాయకులు ద్వందవైఖరితో పనిచేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోవాలని జేయేసీకి మా విజ్ఞప్తి.

జీయేసీలో చేరినవారు, జేయేసీ నిర్ణయాలకు విరుద్ధంగా పనిచెస్తె వారిని ఏం చెయాలో కూడా నిర్ణయించాలి.

ఉద్యమానికి ద్రోహం చేస్తే ఎట్లాంటి శిక్ష ఉంటుందో ముందుగానే నిర్ణయం జరగాలి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు మీతో ఉంటారు.

రాజేష్‌ (ఓయూ జేయేసీ)

నాయకులు తమ పదవులను వదిలెసారు. విద్యార్థులు తమ జీవితాలనె వదిలెసారు. విద్యార్థుల్లో అభద్రతాభావం ఉన్నది.

విద్యార్థి ఉద్యమం ప్రజాఉద్యమంలో భాగం మాత్రమె. తెలంగాణ ఉద్యమంలో అనేకమార్లు దగా జరిగింది. ఈ సారి అట్లా జరగకుండా చూడాలి.

మహ్మద్‌ మసూద్‌ అహ్మద్‌

ఆంధ్రావాళ్లు మనమీద పెత్తనం చేస్తున్నరు. తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నరు.

భారత స్వాతంత్రోద్యమం లాగా మన ఉద్యమం కొనసాగాలి. బ్రదర్‌ జాన్‌ (క్రిస్టియన్‌ వాధర్‌) పండుగకంటె ముఖ్యం తెలంగాణ.

అందుకె ఇవ్వాళ్ల క్రిస్‌మస్‌ పండుగ అయినప్పటికీ ఈ మీటింగుకు వచ్చినం. తెలంగాణ రాష్ట్రం కోసం రోజూ వ్రార్ధనలు చేస్తున్నము.

తెలంగాణ నాయకులకు మంచి బుద్ది కలిగించాలని దేవున్ని కోరుతున్న..

అందెశ్రీ (కవి, గాయకుడు)

మనం గుంపులుగా మారకపోతే శత్రువును ముంపునకు గురిచే సేదెప్పుడు? ఈ మీటింగులు జనాలలో పెట్టంది. ఉద్యమంలో దళితబహుజనులను భాగస్వాములను చేయాలి.

ఎక్కువ, తక్కువలు మరవకపోతే ముందుకు పోలెం. ప్రాణ నష్టం లేకుండా విజయం రాదు.

ముందు మీరు ఐక్యంగా ఉండండి, మేము కోటి పాటలతో కోలాటం ఆదుతాం … (జైబోలో తెలంగాణ పాటను మొదిటిసారిగా పాడి అందరినీ ఉరూతలూగించారు.)

సూర్యం (న్యూ డెమెక్రస్‌)

ఈ సభా నిర్వహణపట్ల మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. అరుణోదయ కళాకారుడు కృష్ణను నకిరెకల్‌ దగ్గర పోలిసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం.

సెటిలర్స్‌తో ర్యాలీలు జరుపుతున్నాం. తప్పు జరిగిన సందర్భాలలో సరిదిద్దుకునే ప్రయత్నం జరగాలి.

ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని బలపరచాలి. గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా మీటింగులు జరగాలి. నల్లజెండాలు ఎగురవెయాలి.

బస్సుల్లో, రైళ్లలో, బస్తాండుల్లో మీటింగులు నిర్వహించాలి. పొయ్యి వెలగవద్దు, ముద్ద ముట్టవద్దు. సహాయ నిరాకరణ వాటించాలి.

సుధాకర్‌రెడ్డి (ఉవాధ్యాయ సంఘాల ప్రతినిధి)

ఉపాధ్యాయులు ఉద్యమంలో ముఖ్యవాత్ర పోషించాలి. భవిష్యత్తులో మీరె తెలంగాణ హీరోలు.

కె. స్వామిగౌడ్‌ (టీఎన్జీవో అధ్యక్షులు)

పదవులకు రాజీనామాలు చేసివచ్చిన నాయకులను మళ్లీ ఎన్నికల్లో గెలిపించుకుంటాము. ఆంధ్రా అధికారుల నుండి ఫోన్‌ వస్తే ఆన్సర్‌ చెయము.

సహాయ నిరాకరణ చేయాలని క్రిందిస్థాయి శ్రేణులకు పిలుపునివ్వండి. ఆంధ్రా వ్యాపార సంస్థలను బహిష్మరించాలి.

నాయకులు వారి భార్యలను, కుటుంబసభ్యులను ఉద్యమంలోకి తీసుకురావాలి. తెలంగాణలో ప్రతి ఇంటి గోడకు తెలంగాణ నినాదం రాయాలి.

ఇంటిపైన తెలంగాణ జెండా ఎగురవేయాలి. జేయేసీ తరఫున తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకునెందుకు ఒక నిధిని ఏర్పాటు చేయాలి.

అందుకు అందరూ ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలి. జేయేసి ఇచ్చే ఏ పిలుపునైనా అమలుచెస్తాం.

మందకృష్ణ మాదిగ (ఎం.ఆర్‌.పి.ఎస్​.)

యాభయి సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక దశకు చేరుకున్నం. అనెక కారణాలపల్ల రాజకీయప్రక్రియ అనేక సందర్భాలలో విఫలమయ్యింది.

అయితే తెలంగాణ డిమాండును దేశం గుర్తించేలాగా చెయగలిగాము. పోరాటం కూడా అవసరమె అని ఇప్పుడు గుర్తించాము.

సమైక్యాంద్ర ఉద్యమం ప్రజాఉద్యమం కాదు. మీడియా ఆ ప్రయత్నం చేస్తున్నది. ఉద్యమాలను అణచడానికి పోలీసు బలగాలను దించుతున్నారు.

విద్యార్థి జేయేసీ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అణగారిన కులాల ఐక్యవేదిక తనవంతుపాత్రను నిర్వహిస్తున్నది.

కళాకారుల జేయేసి ఏర్పాటు జరగాలి. మన మంత్రుల రాబినామాలు గౌరవాన్ని పెంచాయి. ఉద్యమం నిరుత్సాహంగాలేదు. ప్రజలు ఉద్యమంలో ఉన్నారు.

నిర్మాణాత్మకంగా వారిని మార్చుకోవాలి. బిల్లా, మండల, [గ్రామ స్థాయిల్లో జేయేసీల నిర్మాణం జరగాలి.

ఉద్య మంతోపాటు నిర్మాణం కూడా పదిరోజుల్లో పూర్తిచెసుకోవాలి. ఒకే టెంటుకింద అన్ని పార్టీల నాయకులు, ఒకే లక్ష్యంతో ఉమ్మడి నిరాహారదీక్షలు జరగాలి.

హనుమాండ్లు (ఐక్య కార్యాచరణ కమిటి)

ప్రజలు ఐక్యతను కోరుకుంటున్నారు. అందరినీ కలుపుకుని ముందుకు పోవాలి.

వేణుగోపాల్‌రెడ్డి (ఎ.పి.టి.ఎఫ్‌)

గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచడంలో ఉపాధ్యాయులు కీలకంగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ను దిగ్భంధం చెసె కార్యక్రమాన్ని తీసుకోవాలి. సెటిలర్స్‌ను బెదిరించే కార్యక్రమాలను చేయకుండా ఉద్యమకారులను నిలువరించాలి.

ఓరుగంటి వెంకటేశం (తెలంగాణ బీసీ సంగ్రామ సమితి)

 బడుగు,బలహీన వర్ణాలను ఉద్యమంలో కలుపుకునిపోవాలి. తెలంగాణ రాష్టం కోసం బలహీనవర్ణాలను సమీకృతం చెయాలి.

01 జనవరి 2010:

నా రక్తం…. నా తెలంగాణ గిన్నీస్‌ రికార్డు

నా రక్తం… నా తెలంగాణ నినాదంతో ఎబివిపి చేపట్టిన మహారక్తదాన శిబిరం గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది.

తెలంగాణ వ్యాప్తంగా 143 రక్తదాన శిబిరాలలో 18650 మంది తెలంగాణ కోసం రక్తదానం చేసినట్లు ఎబివిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం రాజు తెలిపారు.

గిన్నీస్‌ బుక్‌లో గత రికార్డు 17.900 మంది రక్తదానంను అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు నగర కార్యదర్శి రామకృష్ణ వివరించారు.

విద్యార్థులతో పాటు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే లక్ష్మినారాయణ, గాయకులు అందెశ్రీ, ఎన్‌ఆర్‌ఐలు, న్యాయవాదులు రక్తదానం చేశారు.

129  రాజీనామాలు తిరస్కరించారు.

రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్రకు చెందిన 222 మంది రాజీనామాలు చేయగా అందులో 92 మంది రాజీనామాలు వెనెక్కు తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 129 మంది రాజీనామాలను తిరస్కరించినట్లు స్పీకర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్ది తెలివారు.

బంజాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో తెలంగాణ జేయేసీ ప్రత్యేక సమావేశం.

హాజరైన కెసిఆర్‌, కాంగ్రెస్‌, తెలుగుదెశం, బిజెపి పార్టిలకు చెందిన శాసన సభ్యులు, సీనియర్‌ నాయకులు. మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఉద్యమకారుల డిమాండ్‌.

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 9

Recent

- Advertisment -spot_img