కరోనా వైరస్‌పై ఇప్పటికీ ఎన్నో సందేహాలు !! అసలు వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది?
కొవిడ్-19 ( COVID-19 ) సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అనే వాటిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు తిరుగుతున్నాయి.
అయితే వాటిలో ఏవి నిజమో !! ఏవి అబద్దమో !! తెలియక కొద్దిమంది జనాలు అయోమయానికి గురవుతున్నారు.
ఇంకొందరు అయితే సోషల్ మీడియాలో చెప్పే చిట్కాలు పాటించి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కరోనాపై ఉన్న కొన్ని సందేహాలు, వాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) సహా ఇతర వైద్య నిపుణులు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చూద్దాం..
ఆల్కహాల్ తాగితే కరోనా రాదు అన్న దానిలో ఏ మాత్రం వాస్తవం లేదు.
ఆల్కహాల్ తాగడం ఎప్పటికీ ప్రమాదకరమే. కరోనా సోకకుండా ఉండాలంటే తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
మాస్కులు ధరించాలి. జ్వరం, దగ్గు ఉన్న వారికి వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది.