Homeహైదరాబాద్latest Newsతాగునీటి కోసం గొడవ.. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు..

తాగునీటి కోసం గొడవ.. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు..

ఇదే నిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మియాపూర్ లో సంతోష్ దాబా పక్కన చాయ్ బండి దగ్గర మంచినీళ్లు తాగడానికి ఇసుక లేబర్ సాయిలు వెళ్ళాడు.
సాయిలు బాటిల్ లో నీళ్లు పట్టుకొని వస్తున్న సమయంలో నీళ్లు ఎందుకు పట్టుకున్నావంటూ గొడవ చేసిన చాయ్ బండి ఓనర్… ఆ తరవాత మాట మాట పెరగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సాయిలు అనే వ్యక్తి మీద ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాళ్ళు, చేతులు కట్టేసి దారుణంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img