ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప మొదటి భాగంలో ముఖ్యంగా ‘ఊ అంటావాలో’ పాటలో సమంతా చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అ పాటకి వచ్చిన రెస్పాన్స్ చూసిన చిత్రబృందం రెండో భాగంలో కూడా అలంటి అదిరిపోయే పాటని పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ‘పుష్ప 2’లో ఐటెం సాంగ్ కోసం ట్రిప్తి డిమ్రీతో సహా పలు పేర్లు వినిపించాయి కానీ ఆవేవి నిజం కాలేదు. అయితే తాజాగా శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో సాంగ్ చేస్తునట్టు తెలుస్తుంది. తెలుగు మరియు హిందీ సినిమాల్లో మంచి ఫాలోయింగ్‌ను ఉన్న శ్రద్ధా కపూర్ తో పాట చేయడం ద్వారా ఉత్తర మరియు దక్షిణాది మార్కెట్ పెరుగుతుంది అని చిత్రబృందం ఆలోచిస్తుంది. మరి ఈ విషయాన్నిచిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.