ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి గ్రామం సమీపంలో పెద్దవాగులో ఓ వింత చేప లభ్యమైంది. శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడికి ఈ చేప దొరికింది. ఇది నల్లమచ్చలతో ఆకారం వింతగా ఉంది. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి మధుకర్‌ను సంప్రదించగా.. ఈ చేపను డెవిల్‌ఫిష్ అంటారని తెలిపారు. ఈ చేపలు తినేందుకు పనికి రావని తెలిపారు.