Homeసినిమాబాస్​ కోసం సరికొత్త ప్రపంచం

బాస్​ కోసం సరికొత్త ప్రపంచం

టాలీవుడ్​ బాస్​, మెగాస్టార్ చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ భారీ సోషియో ఫాంటసీ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇది మెగాస్టార్ కెరీర్​లో 156వ సినిమా కానుంది. కీరవాణి సంగీతం అందించనుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్​లో జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంగ్లిష్ పత్రికతో ముచ్చటించిన దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తన చిన్నతనంలో మెగాస్టార్ గారి జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ చూసి ఎంతో ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ విధమైన సోషియో ఫాంటసి మూవీని మెగాస్టార్ మళ్లీ చేయలేదని, మధ్యలో అంజి వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయి ఫాంటసీ మూవీ కాదన్నారు. అందుకే తాను ప్రస్తుతం తీయబోయే సినిమా విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీలో దాదాపుగా 70 శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, తప్పకుండా చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరూ ఆయన నుండి ఆశించే అన్ని అంశాలు తన పాత్రలో ఉంటాయని తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ఒక్కొక్కటిగా రాబోయే రోజుల్లో వెల్లడవుతాయని తెలిపారు వశిష్ట.

Recent

- Advertisment -spot_img