ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి ఇటీవలే ఓ యాక్సిడెంట్ చేశాడు.
అయితే సదరు వ్యక్తి మృతి చెందడంతో రితీష్ భయాందోళనకు గురైయ్యాడు. కారును ఎన్టీఆర్ నగర్‌లో ఉన్న శ్రీఆద్య ఆస్పత్రి ఎదుట పార్క్ చేసి అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.