ఇదే నిజం, ధర్మపురి: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన ఆరే మహేష్(21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై టి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది శనివారం రోజున ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని తెలిపారు. అతని తండ్రి ఆరే సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.