ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డులో మన అడ్రస్‌ను మార్చుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే అడ్రస్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. మరి ఆన్‌లైన్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఎలాగో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
- ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.
- హోం పేజిలోని My aadhaar సెక్షన్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి
- ఆ తర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయ్యాక Update Addressపై క్లిక్ చేయాలి
- అప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అవి 1. Update Address via Address Proof 2. Update Address via Secret Code
- మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
- మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ లేకపోతే Address Validation Letterను తీసుకోవాలి
- దీని కోసం నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవి 1. Resident initiates request, 2. Address verifies consents, 3.Resident submits request, 4.Use secret code to complete.
- ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీకు అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ పోస్టులో వస్తుంది.
- ఆ లెటర్ వచ్చాక పైన చెప్పిన రెండో ఆప్షన్(Update Address via Secret Code )ను ఎంచుకోవాలి
- లెటర్‌లో ఉన్న సీక్రెట్‌ను కోడ్‌ను అక్కడ ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
- ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయగానే ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్(SRN) వస్తుంది.
- ఈ SRN నంబర్ ద్వారా అడ్రస్ అప్‌డేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.