టీవీ సీరియల్ చంద్రకాంత్ అలియాస్ చందు (40) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్‌లో చందు నటిస్తున్నాడు. 2015లో శిల్పను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా భార్యాపిల్లలకు చందు దూరంగా ఉంటున్నాడు. ఐదు రోజుల కిందట త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి చందు బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా.. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్లో చందుకు గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత అతడు మానసికంగా కుంగిపోయాడు.
శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ పరిధి అల్కాపూర్ రోడ్ నం.20లో ఉన్న అపార్టుమెంట్‌లోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్ కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్‌కు వచ్చి చూసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందు, పవిత్ర జయరాం ఇద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నట్లు సమాచారం. ఆమె చనిపోయిన తర్వాత అతడు డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పవిత్ర లేకుండా తాను బతకలేనని.. ఆమె లేని జీవితం వద్దంటూ చందు తన ఫ్రెండ్స్ వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.