టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తన పేరును ఆకాశ్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. తన పేరు మార్పు గురించి ఆకాశ్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. “నా పేరులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు నా పేరు ఆకాశ్ పూరీ కాదు. ఇప్పటి నుంచి నేను ఆకాశ్ జగన్నాథ్” అని ప్రకటించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అభిమానులు ఆకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు.