మద్యాన్ని మితంగా తాగడం, లేదా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం 12 సంవత్సరాల పాటు 60 అంతకంటే ఎక్కువ వయసు గల 1,35,103 మందిపై పరిశోధన జరిపింది. ఈ అధ్యయనం ప్రకారం, మద్యం కొంచెం తీసుకున్నా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపింది. తొలి చుక్క నుంచే ఈ ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.