పూరీ జగన్నాథ ఆలయంలో భక్తుల దర్శనాలకు కొత్త విధానంని జనవరి ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. దీని ద్వారా ఆలయానికి వచ్చే మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బయటకు వెళ్లేందుకు రెండు వేర్వేరు దారులు రూపొందించామని ప్రకటించారు.