రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఆన్‌లైన్‌లో సర్వే, డిజిటల్‌గా కొన్ని పత్రాలు పంపాలంటూ నేరస్థులు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్ చేశామని, అడిగిన పత్రాలు ఇవ్వాలంటూ కాల్స్ వస్తున్నట్లు సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఎవరైనా కుటుంబ సర్వే పేరుతో కాల్స్ చేసి OTPలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు.