Homeఫ్లాష్ ఫ్లాష్పంజాబ్ లో ఏలియన్స్?

పంజాబ్ లో ఏలియన్స్?

The debate over whether there are aliens on Earth. Even though there is no clear information about these till now .. Aliens wonders are not stop in the sky.

భూగ్రహంపై ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉన్నాయా.. అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంది. వీటిపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం రాకున్నా.. ఆకాశంలో ఏలియన్స్ వింతలు మాత్రం ఆగడం లేదు.

ఈ వింతలు కేవలం పరాయి దేశాలకే పరిమితం కాలేదు. మన ఇండియాలో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని లుధియానాలో రాత్రిపూట కనిపించిన వింత కాంతులు స్థానికులను ఆశ్చర్యపరిచాయి.

లుధియానా ప్రజలు ఈ వింతని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇటీవల రాత్రి 9 నుంచి 9.05 గంటల సమయంలో లుధియానా ప్రజలు ఆకాశంలో ఏదో మండుతూ.. కదులుతున్నట్లు కనిపించింది.

దీంతో అంతా విమానం ప్రమాదానికి గురై ఉండవచ్చని భావించారు. అది విమానం కాదని, తప్పకుండా గ్రహాంతరవాసులు వాహనం(UFO) కావచ్చని మరికొందరు అంటున్నారు.
అయితే, ఉల్క లేదా తోక చుక్క కావచ్చని మరికొందరు వాదిస్తున్నారు.

భూవాతావరణంలోకి రాగానే మండిపోవడం వల్ల అలా కనిపించి ఉండవచ్చని అంటున్నారు.
అయితే, దీనిపై అధికారులు స్పందించలేదు. ఈ వీడియో చూసి అదేంటో మీరైనా చెప్పగలరా?

Recent

- Advertisment -spot_img