డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ కి సెన్సేషనల్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీకి ఇప్పుడు నార్త్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ పుష్ప సినిమా తర్వాత చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసేందుకు బన్నీతో పోటీ పడ్డాయి. బన్నీ అప్పట్లో కొన్ని యాడ్స్ కూడా చేశాడు. కానీ ఓ అంతర్జాతీయ కంపెనీకి వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది.
పుష్ప తర్వాత అల్లు అర్జున్‌కి ప్రసిద్ధపొగాకు బ్రాండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను ఆఫర్ చేసిందట. ఈ ప్రకటనకి దాదాపు రూ.10 కోట్లు ఆఫర్ చేశారు. తమ ప్రకటనలో కేవలం 60 సెకన్లు మాత్రమే కనిపించాలని అభ్యర్థించారట. అయితే ఆ ఆఫర్‌ను బన్నీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మద్యం, పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనల్లో కనిపిస్తే తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు దుష్ప్రచారం చేసినట్లేనని అన్నారని తెలుస్తుంది. ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా చేయనని చెప్పాడు. నిన్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ నిర్ణయం మరోసారి వార్తల్లోకి ఎక్కనుంది.