హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్‌కు వచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడడానికి సుముఖత చూపలేదని సమాచారం. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని చెప్పి వెళ్లిపోయారు.