బాదంపప్పును రాత్రిళ్ళు నానబెట్టి ఉదయం తినమని పెద్దలు చెప్తుంటారు.
ఇలా ఎందుకు నాన పెట్టుకొని తినాలని మనలో చాలామందికి సందేహాలు ఉంటాయి.
ఇలా చేస్తే మనకు లాభం ఏంటి? అని కొందరు అడుగుతుంటారు. మరికొందరేమో అలాగే తినేస్తూ పని కానిచ్చేస్తరు.
ఇందులో వాస్తవం ఏది.
దీని గురించి కొందరు పోషకాహార నిపుణులను సంప్రదించగా వారు చెప్పిన విషయం ఏంటంటే.. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది.
ఇది శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా అడ్డుకుంటుందట.
నాన బెట్టడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుందట. దీనివల్ల బాదంలోని పోషకాలు చక్కగా శరీరానికి చేరతాయన్నారు.
డైలీ బాదం తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెప్పారు.
బాదంలోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గించడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయట.
బాదం పప్పులను నానబెట్టడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సమృద్ధిగా అందుతాయి.
క్యాన్సర్‌తో పోరాడేందుకు బాదంలో ఉన్న విటమిన్ B7, ఫోలిక్ యాసిడ్లు తోడ్పడుతాయి.
వీటితోపాటు పుట్టుకతో వచ్చే లోపాలను సైతం తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం రోజు రెండు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తినేయండి మరీ.