ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆటగాళ్లకు ఆ జట్టు యాజమాన్యం నైట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో ఆండ్రీ రస్సెల్ తెగ సందడి చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి రస్సెల్ డాన్స్ చేశాడు. పంజాబీ పాట ‘లుట్ పుట్ గయా’ అనే పాటకు ఇద్దరు స్టెప్స్ వేశారు. ఈ పాట షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ సినిమాలోనిది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.