HomeతెలంగాణAnnexation of Hyderabad : ఆపరేషన్ పోలో గురించి పూర్తిగా తెలుసా..

Annexation of Hyderabad : ఆపరేషన్ పోలో గురించి పూర్తిగా తెలుసా..

Annexation of Hyderabad : ఆపరేషన్ పోలో గురించి పూర్తిగా తెలుసా..

Annexation of Hyderabad : నిజాం రాజ్యాన్ని భారతదేశ యూనియన్‌లో విలీనం చేయడానికి చేసిన పోలీసు చర్యనే ఆపరేషన్ పోలో అంటారు.

సైనిక రహస్య పత్రాలలో దీనిని ఆపరేషన్ కాటర్ పిల్లర్ గా పేర్కొంటారు.

దీన్ని రూపొందించినవారు – ఇ.ఎన్. గోదార్డ్‌

అప్పటి ప్రధాన సైన్యాధిపతి సర్ రాయ్ బౌచర్

అప్పటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్.

గోడార్డ్ ప్రణాళికను అమలుపరిచే బాధ్యతను అప్పటి దక్షిణ కమాండెంట్ చీఫ్ లెఫ్ట్ మెంట్ జనరల్ రాజేంద్రసింగ్ జీ జడేజాకు అప్పగించారు.

ఈయ‌న సైన్యాన్ని మూడు యూనిట్లుగా విభ‌జించారు.

Telangana Movement : తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

జనరల్ జె.యన్. చౌదరి నాయకత్వాన షోలాపూర్ నుండి దాడులు ప్రారంభించారు.

జనరల్ ఎ.ఎ.రుద్ర నాయకత్వాన విజయవాడ నుండి దాడులు ప్రారంభించారు.

జనరల్ శివదత్ సింగ్ నాయకత్వంలో హోస్పేట్/బీరార్ నుండి దాడులు ప్రారంభించారు.

ఎయిర్‌ఫోర్స్ ద్వారా పూణె నుండి దాడి చేయాలి.

జె.యన్.చౌదరి నాయకత్వం వహిస్తున్న షోలాపూర్ దళాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు.

అవి స్ట్ర‌య్‌కింగ్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, బీర్ ఫోర్స్

ఎ.ఎ.రుద్ర బెటాలియనను 2 దళాలుగా విభజించారు. అవి 17వ పూణ హార్స్‌, క్వీన్ విక్టోరియా.

శివదత్ సింగ్ దళాన్ని 1వ మైసూర్ ఆర్మీ, 5/5 గుర్బాలైఫిల్స్‌గా విభజించారు.

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2011 ‌‌- 4

1948 సెప్టెంబర్ 13 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ పై ఆపరేషన్ పోలో జరిగింది.

దీనినే పోలీస్ చర్యగా పరిగణిస్తారు. 4 వైపుల నుండి ఈ దాడి నిర్వహించారు.

1948 సెప్టెంబర్ 17న చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ భారత సైన్యాలకు లొంగిపోయినట్లు ప్రకటించి హైదరాబాద్ సంస్థానమును ఇండియన్ యూనియన్ లో విలీనం చేశాడు.

భారత ప్రభుత్వం మీర్ ఉస్మాన్ ఆలీఖానను రాజ్ ప్రముఖ్ గా నియమించింది.

1948-49 మధ్య హైదరాబాద్ రాష్ట్ర సైనిక గవర్నర్ – జె.ఎన్. చౌదరి

1950 జనవరిలో ఏర్పడిన పౌరప్రభుత్వానికి ముఖ్యమంత్రి – వెల్లోడి

1954లో ఫ్రెంచి ప్రభుత్వం పాండిచ్చేరిని భారత్ కు అప్పగించింది.

1961లో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా గోవా, డామన్ డయ్యూ ప్రాంతాలు పోర్చుగీసు నుంచి స్వాతంత్ర్యం పొంది భారత్ లో విలీనం అయ్యాయి.

Recent

- Advertisment -spot_img