అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు. మిస్సిస్సిప్పిలోని ఇండియానోలాలో గల చర్చి స్ట్రీట్‌లో ఉన్న ఓ నైట్‌క్లబ్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.