HomeజాతీయంAnti-Conversion Bill : మతం మార్చితే 10 ఏళ్ల జైలు.. ల‌క్ష జ‌రిమానా..

Anti-Conversion Bill : మతం మార్చితే 10 ఏళ్ల జైలు.. ల‌క్ష జ‌రిమానా..

Anti-Conversion Bill : మతం మార్చితే 10 ఏళ్ల జైలు.. ల‌క్ష జ‌రిమానా..

Anti-Conversion Bill : బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో మతమార్పిడుల బిల్లు ప్రతిపాదనకు వచ్చింది.

ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా గుంపులుగా మతమార్పిడులకు పాల్పడితే 10ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.

దీని ప్రకారం.. మతం మార్చుకునేముందు ఒక నెల రోజుల గడువు ఇవ్వాలని, ఫామ్ 2లో భాగంగా ఎవరైనా జిల్లా మెజిస్ట్రేట్ లేదా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కు నోటీసు పంపాల్సి ఉంటుందని చెప్పారు.

Read This : రైతుల ఖాతాకు పిఎం కిసాన్ నిధులు.. ఎప్పుడంటే..

తమకు తామే మార్చుకుని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అటువంటి మార్పిడులను పట్టించుకోవలసిన అవసర్లేదని అన్నారు.

ఈ చట్టం అమల్లోకి వస్తే.. ‘తప్పుగా ప్రేరేపిస్తూ, బలవంతంగా, మితిమీరి, ఆకర్షణ లేదా ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహం ద్వారా లేదా అలాంటి మార్పిడిని ప్రోత్సహించి కుట్ర చేయాలనుకునేవారి కోసమే ఇది.

ఏ వ్యక్తి అయినా తన పాత మతంలోకి తిరిగి మారినట్లయితే, ఈ చట్టం ప్రకారం మార్పిడిగా పరిగణించరు’ అని చట్టంలోని సెక్షన్-3లో రాశారు.

Read This : భారతీయ విద్యార్థులు, టీచర్లకు మోటా పాఠాలు…

ప్రతిపాదిత చట్టం ప్రకారం, “ఏదైనా బాధిత వ్యక్తి, అతని తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి లేదా రక్తం, వివాహం లేదా దత్తత ద్వారా అతనికి సంబంధించిన ఏ ఇతర వ్యక్తి అయినా, అటువంటి మార్పిడికి సంబంధించిన మొదటి సమాచార నివేదికను నమోదు చేయవచ్చు, ఇది సెక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది.

ముసాయిదా రెగ్యులేషన్ ప్రకారం.. సెక్షన్-3లోని నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన వారికి ఎలాంటి పౌర బాధ్యతలకు పక్షపాతం లేకుండా, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడాలి.

జరిమానా విధించబడుతుంది, ఇది రూ. 25,000 కంటే తక్కువ ఉండేందుకు వీల్లేదు.

Read This : 13 సంస్థలు..రూ.2,84,980 కోట్లు.. బ్యాంకులకు ఎగవేతలు

SC/ST, మైనర్‌లను మార్చినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

“మైనర్, స్త్రీ లేదా షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తికి సంబంధించి సెక్షన్ 3 యొక్క నిబంధనను ఉల్లంఘించిన వారికి 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.

ఇది రూ. 50వేల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.

సామూహిక మత మార్పిడికి పాల్పడితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించబడుతుంది.

Recent

- Advertisment -spot_img