Homeహైదరాబాద్latest Newsఏపీ కేబినెట్ సమావేశం.. పలు అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

ఏపీ కేబినెట్ సమావేశం.. పలు అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పథకాలతో పాటు కొత్త పాలసీలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు పాలకవర్గాల నియామకంలో చట్ట సవరణపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 31 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధానాలు ఆమోద ముద్ర వేయబడతాయి. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876. కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.25 సబ్సిడీ ఇస్తుండగా, ప్రస్తుతం ఒక్కో సిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు నివేదిక సమర్పించారు.ఇక, వలంటీర్ల కొనసాగింపుతో పాటు వేతనాల చెల్లింపుపై మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఎంతమంది వలంటీర్లను వినియోగించుకోవాలి, విధులు కేటాయించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త రేషన్‌కార్డులపై కోసం అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు రాష్ట్రంలో ఏడాది కాలంగా కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు. దీంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల సమస్యపై అధికారుల నివేదికపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, అనర్హులకు కార్డుల తొలగింపుపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇసుక, మద్యం పాలసీ అమలుపై మంత్రివర్గం సమీక్షించనుంది. ఇక.. ఇరిగేషన్ సొసైటీల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img