పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్న పార్టీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. పెద్దమక్కెనలోని పెట్రోల్ బంక్ వద్ద కాపుకాసి.. మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.