Homeసైన్స్​ & టెక్నాలజీApply New PAN Card : పాన్ కార్డ్ అప్లైకి బెస్ట్​ సైట్ ఏది.. స్టెప్​...

Apply New PAN Card : పాన్ కార్డ్ అప్లైకి బెస్ట్​ సైట్ ఏది.. స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​

Apply New PAN Card : పాన్ కార్డ్ అప్లైకి బెస్ట్​ సైట్ ఏది.. స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​

Apply New PAN Card : ఈ రోజుల్లో పాన్‌కార్డు చాలా ముఖ్య‌మైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్ తీసుకోవాల‌న్నా కూడా పాన్ కార్డు ఉండాల్సిందే.

చాలా ప‌నుల‌కు ఇప్పుడు పాన్‌కార్డును అడుగుతున్నారు. అందుకే.. ప్ర‌తి ఒక్క‌రు పాన్‌కార్డును తీసుకుంటున్నారు.

అయితే.. పాన్​ కార్డు అప్లై చేసుకోవడానికి చాలా మంది ఇంటర్నెట్​ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు.

కానీ మన ఇంట్లోనే మొబైల్​ లేదా పర్సనల్​ కంప్యూటర్​లో నుంచి కూడా పాన్​ కార్డు సులువుగా అప్లై చేసుకోవచ్చు.

ఇక పాన్​ కార్డు ఏ వెబ్​ సైట్లో చేయాలన్న విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి.

కొన్ని వెబ్​సైట్లలో పాన్​ కార్డు అప్లై చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

పాన్ కార్డ్‌లో ఫోటో లేదా సంతకం మార్చుకోండి సులువుగా

అయితే దాంట్లో చూసి పాన్​ కార్డు అప్లై చేయడం అంత సులువు కాదు అనుకుంటారు చాలామంది.

కానీ PAN Card – UTIITSL అనే వెబ్ సైట్​ ద్వారా సులువుగా త్వరగా 10 నిమిషాలలో పాన్​ కార్డు అప్లై చేసుకోవచ్చు.

ముందుగా మీ ఆధార్​ కార్డు దగ్గర ఉంచుకోండి..

స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​

ఇందుకోసం www.pan.utiitsl.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి PAN card for Indian citizen అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.

తరువాత మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి..

పాన్‌కార్డు పోయిందా? టెన్ష‌న్ వ‌ద్దు ఇలా మ‌ళ్ళీ పొందొచ్చు..

ఇందులో ముందుగా Apply for New Pan card (Form 49A) పై క్లిక్​ చేయాలి..

ఆ తరువాత పైన ఉండే ఆప్షన్లలో Digital Mode క్లిక్​ చేయండి..

Physical Mode అంటే మళ్ళీ ఆ కాగితాలను తీసుకుని ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది.

కాబట్టి Digital Mode మాత్రమే ఎంచుకోండి.

ఆ తరువాత దాని కింద కనిపించే Aadhaar based e-KYC option బాక్స్​లో టిక్​ చేయండి..

దాని కొందనే ఉండే eSign Mode పై కూడా టిక్​ వచ్చిందా లేదా చూసుకోండి..

పీవీసీ ఆధార్​ కార్డు కావాలా.. ఇలా అప్లై చేసుకోండి..

లేదంటే eSign Mode పై టిక్​ వచ్చేలా టిక్​ చేయండి.

మరింత కింద Status of the Applicant లో నేరుగా Individual ఆప్షన్​ వస్తుంది.

ఆ తరువాత PAN CARD Mode క్రింద ఉండే ఆప్షన్లు కేవలం ఈ మేయిల్​ ద్వారా మాత్రమే పాన్​ కార్డు నెంబర్​ కావాలా లేదా పోస్టులో ప్రింటెడ్​ కార్డు కుడా కావాలా అనే ఆప్షన్లు.

వాటిలో మొదటిది అయిన Both physical PAN Card and e-PAN కు టిక్​ చేయండి.

తరువాత కింద ఉండే సబ్మిట్​ ఆప్షన్​ నొక్కండి.

ఇక తరువాత ఈజీగా ఉండే మీ పేరు. ఆధార్​ నెంబర్​, తండ్రి పేరు వంటి ఆప్షన్లు కనిపిస్తాయి వాటిని ఫిల్​ చేసి పేమెంట్​ చేయాలి..

ఆ తరువాత ఏవో కోడ్​లు అడుగుతుంది.

కోడ్​ల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

అందులో పేజీ కింద ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి..

మీ ఏరియా ఏ అక్షరంతో ఉంటుందో దాంట్లో తెలుస్తుంది.

ఆ కోడ్​లను అప్లికేషన్​లో ఎంటర్​ చేయండి.

ఆన్‌లైన్‌లో అప్లై.. నెల రోజుల్లో ఇంటికే కార్డు.. పైసా ఖర్చు లేకుండా ఇంటినుంచే పని పూర్తి

అనంతరం మీ పాత జిల్లాను ఉంచుకుని పిన్​ నెంబర్ నమోదు చేయండి.

​తరువాత వచ్చే ఆప్షన్లలో ఫోటో, సంతకం వంటి ఆప్షన్లు ఆధార్​ ద్వారా తీసుకుంటున్నట్లు చూపిస్తుంది.

అనంతరం సబ్మిట్​ చేయండి.

ఈ మద్యలో మీకు రిజిస్టర్​డ్​ మొబైల్​ నెంబరుకు ఓటీపీ వస్తుంది.

అన్నీ పూర్తయిన తరువాత మీకు అక్కడ అప్లికేషన్​ ఐడీ ( U-NXXXXXXXX ) వస్తుంది.

బ్రోకర్​ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్‌ ఎలా..

తరువాత మీరు మరోసారి ముందు పేజీకి రావాల్సి ఉంటుంది.

ఇందులో ఈ సారి రెండవ ఆప్షన్​ ఎంచుకోవాలి..

ఇందులో U- లేకుండా మీ ఐడీని ఎంటర్​ చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు మీ ఆధార్​ లింక్​ ఉన్న ఫోన్​ నెంబర్​ ద్వారా మీ E-KYC చేసుకోవాల్సి ఉంటుంది.

అనంతరం ఒక వర్కింగ్​ డేలో మీకు మీరు ఇచ్చిన ఈ ‌‌‌‌మేయిల్​ కు ఈ పాన్​ కార్డును పంపుతారు.

వారం రోజులలో మీ అడ్రస్​కు ప్రింటెడ్​ పీవీసీ పాన్​ కార్డు కూడా వస్తుంది.

Recent

- Advertisment -spot_img