ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైన 6 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఆపై ఒక లేఖ ద్వారా రూ.50 లక్షలను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ గోపాల్ యాదవ్, సహరాన్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం ధన్‌పూర్ గ్రామంలో అతడి కుమారుడు పునీత్ అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, చివరకు చెరకు తోటలో బాలుడి మృతదేహాన్ని ఆ కుటుంబం గుర్తించింది. భూవివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు బావిస్తున్నారు.