హైతీలోని సైట్ సోలైల్లో చేతబడి చేసి తన కుమారుడి అనారోగ్యానికి కారణమయ్యారంటూ 110 వృద్ధులను చంపి ఓ ముఠా నాయకుడు నరమేధం సృష్టించాడు. మోనెల్ ‘మికానో’ ఫెలిక్స్ అనే గ్యాంగ్ స్టర్ కుమారుడు ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. అతని అనారోగ్యానికి గల కారణమేంటని ఓ పూజారిని ఆరా తీయగా ఈ చుట్టుపక్కల నివసిస్తున్న వృద్ధులేనని చెప్పాడు. దీంతో ఫెలిక్స్.. ముఠా సభ్యులతో కలిసి కొడవళ్లు, కత్తులతో ఆ ప్రాంతంలో 60 ఏళ్లు దాటిన వారందరినీ బలి తీసుకున్నాడు.