శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. అజిత్ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పైనుంచి రాళ్లు రువ్వినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది.
అయితే.. జగన్ మీద దాడి జరగడంపై టీడీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘నటనకు నవత తరగని యువత, నీ రస హృదయం రాయని కవిత, అభినయ సిరిగా అభినవ గిరిగా, వచ్చాడు రస రాజు, నిన్ను చూసి మెచ్చాడు నటరాజు’ అని దశావతారం సినిమాలోని పాట లిరిక్స్‌ను ట్వీట్ చేసింది.