Homeహైదరాబాద్latest Newsచిరుధాన్యాలపై అవగాహన

చిరుధాన్యాలపై అవగాహన

ఇదేనిజం, సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ లో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం నాలుగో రోజులో భాగంగా రైతులకు భూసార పరీక్ష పై అవగాహన కల్పించారు. మట్టి నమూనాలు, వాటి ఫలితాలు భూమి ఆరోగ్య కార్డులు ఎలా ఇస్తారో రైతులకు వివరించారు. అనంతరం అంగన్ వాడి లో చిన్న పిల్లలకు,గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల లోపం, మధుమేహం, ఊబకాయం వంటి రుగ్మతలకు జొన్నలు కొర్రలు వంటి చిరుధాన్యాల వల్ల కలిగే లాభాలు వివరించారు. ఇందులో భాగంగా చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు చేసి వాళ్లకు చిరుధాన్యాల పోషక గుణాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి అరుణ్ బాబు, శ్రీమతి కె.భవ్య శ్రీ, కళాశాల విద్యార్థులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img