ఎస్.ఎస్.రాజమౌళి, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ “బాహుబలి” గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో తన ట్రేడ్‌మార్క్‌గా చాటుకుంది. అయితే ఈ పాత్ర నేపథ్యంలో “బాహుబలి – క్రౌన్ ఆఫ్ బ్లడ్” అనే యానిమేషన్ సిరీస్ రాబోతోందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అఫీషియల్ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీ డేట్ సంబంధించిన అప్ వచ్చింది. Disney+ Hot Star ఈ సిరీస్‌ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ని మే 17న విడుదల చేయనున్నట్లు ధృవీకరించబడింది. మాహిస్మతి సామ్రాజ్యంలో కొత్త కోణంతో ట్రైలర్‌ను విడుదల చేయడం ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి, శరద్ దేవరాజన్‌లు రూపొందించారు. ఈ సిరీస్ కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.