Homeహైదరాబాద్latest Newsబి అలెర్ట్.. మీకు ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయి..? అయితే మీకు జైలు శిక్ష తప్పదు..!

బి అలెర్ట్.. మీకు ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయి..? అయితే మీకు జైలు శిక్ష తప్పదు..!

కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ఒక వ్యక్తి కలిగి ఉండగల గరిష్ట సంఖ్యలో SIM కార్డ్‌లపై స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. అయితే మీ పేరుతో అనేక SIM కార్డ్‌లను తీసుకోవడం వలన మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. టెలికాం చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకున్నట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లవచ్చు. ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులు ఉండాలని.. ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని పేర్కొంది.జమ్మూకశ్మీర్, అస్సాం, ఈశాన్య లైసెన్సు సర్వీస్ ఏరియాల్లో కొందరు అపరిమిత సిమ్ కార్డులు కొంటున్నారని.. అలాంటి చోట్ల టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023ని అమలు చేస్తామని హెచ్చరించింది.పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్నవారికి మొదటిసారిగా రూ. 50,000 వరకు జరిమానా ఉంటుంది. 2 లక్షల జరిమానా విధిస్తారు.గతేడాది డిసెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దీని ప్రకారం ఏదైనా తప్పు చేసినా లేదా టెలికాం నిబంధనలను పాటించకపోయినా రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img