ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా త్వరలో 1000 కోట్లు వసూలు చేయనుంది. ఈలోగా చిత్ర బృందం వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని డైలాగ్స్ పై కొంత మంది కావాలని ట్రోల్ల్స్ చేస్తున్నారు. అయితే సినిమాలో లేని డైలాగ్స్ ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని చిత్రబృందం హెచ్చరించింది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘పుష్ప 2 సినిమా డైలాగ్స్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరినో ఉద్దేశించి సంభాషణలు కూడా పంచుకుంటున్నారు. సినిమాపై నెగిటివ్ ఒపీనియన్ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశ్యంతో కొందరు ఇలా చేశారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు