ఎక్కువ మంది గేదె పాలనే ఇష్టంగా తాగుతారు. ఆవు పాలతో పోల్చితే ఇవి ఎక్కువ అందుబాటులో ఉండటమే కాకుండా త్వరగా జీర్ణమవుతాయనే భావిస్తారు.
ఇటీవల ఆవు పాల వినియోగం కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆవు పాలు, ఆవు నెయ్యిని పవిత్రంగా భావించే ప్రజలు.. ఇప్పుడు క్రమేనా రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.
యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) అధ్యయనం ఆవుపాల ఉపయోగం గురించి తెలియజేసింది.
ఆవు పాలను మీ డైట్‌లో చేర్చుకొనే ముందు తప్పకుండా వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించింది.
ఆవు పాలలో బోలెడన్ని పోషకాలు, A, D విటమిన్లు ఉన్నాయని, ఎముకులకు బలాన్నీ చేకూర్చే కాల్షియం పుష్కలంగా ఉందని పేర్కొంది.
ఆవు పాలలో ఉండే ప్రోటీన్లు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయని స్పష్టం చేసింది. ఆవు పాలల్లో జింక్, అయోడిన్, ఐరన్ సైతం ఆవు పాలతో అందుతాయి.
ఆవు పాలల్లో ఉండే కొవ్వు మాత్రం అంత మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఆవు పాలు కొందరిలో అలర్జీకి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.
ఆవు పాలలోని కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట.