Reverse Walking : వ్యాయామంలో.. వెనక్కి వాకింగ్‌తో షాకింగ్ రిజల్ట్స్
Reverse Walking : రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.
వాకింగ్ వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది.
డయాబెటిస్, కొలెస్ట్రాల్, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు వాకింగ్ వల్ల మనకు కలుగుతాయి.
అయితే నేరుగా వాకింగ్ చేయకుండా రివర్స్‌లో వాకింగ్ చేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు
Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!
అవేమిటంటే…
1. వెనక్కి వాకింగ్ చేయడం అనే విషయం మీకు కొత్తగా అనిపించవచ్చు.
నిజానికి కొందరు ఈ విధంగా కూడా వాకింగ్ చేస్తారు.
ముందు వాకింగ్ చేయడంతోపాటు వెనక్కి వాకింగ్ చేయడం వల్ల కూడా లాభాలు కలుగుతాయి.
వెనక్కి వాకింగ్ చేయడం వల్ల ముందు వాకింగ్ కన్నా ఎక్కువ ఫలితాలు కలుగుతాయి.
రోజూ 10-20 నిమిషాల పాటు వెనక్కి వాకింగ్ చేస్తే అది వారంలో 2-3 సార్లు జాగింగ్ చేసిన దాంతో సమానం.
దీని వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.
Healthy snacks : టిఫిన్, వీటిలో అల్లం వాడితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అద్బుతం
Joint Pains : జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ మూలికలతో చెక్
2. ముందుకు వాకింగ్ చేయడం కన్నా వెనక్కి వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీల శక్తిని ఖర్చు చేయవచ్చు.
దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది.
అధిక బరువు త్వరగా తగ్గుతారు.
3. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల శరీరం బ్యాలెన్స్‌ను పొందుతుంది.
శరీరం స్థిరంగా ఉంటుంది.
4. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల కాస్తంత జాగ్రత్తగా ఉంటారు.
అందువల్ల పరిసరాల పట్ల అప్రమత్తత పెరుగుతుంది.
Never Search In Google: గూగుల్‌లో సెర్చ్ చేయకూడని పదాలు..
Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్
5. వెనక్కి నడవడం అంటే నూతన తరహా చాలెంజ్‌ను స్వీకరించడమే.
దీని వల్ల శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరం ఫిట్‌గా ఉంటుంది.
6. ముందు వాకింగ్ చేయడం వల్ల కొన్ని కండరాల్లో కదలికలు ఉండవు.
అయితే అలాంటి కండరాల్లో కదలికలను కలిగించేందుకు వెనక్కి వాకింగ్ చేయడం ఉపయోగపడుతుంది.
దీంతో అన్ని కండరాలు దృఢంగా మారుతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
7. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల కాళ్లు, కళ్ల కదలికలు సరిగ్గా ఉంటాయి.
ఆ రెండు అవయవాలు సరిగ్గా సమన్వయం చేసుకుంటాయి.
దీంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
8. రోజూ చేసే సాధారణ వాకింగ్‌కు బదులుగా వెనక్కి వాకింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తే కొత్తగా ఉంటుంది.
దీంతో వ్యాయామం చేయడం వల్ల బోర్ కొట్టకుండా ఉంటుంది.
Asthma : ఆస్తమా లేక ఉబ్బసం ఎందుకొస్తుంది.. రాకుండా ఏం చేయాలి..
Proteins For Body : మీ శరీరానికి ఎన్ని ప్రోటీన్లు కావాలో లెక్కగట్టండి ఇలా..