Best Foods you can eat For Strong Long Thick Hair : అమ్మాయిల నుంచి మహిళల దాకా ప్రతి ఒక్కరికీ.. ఒత్తయిన జుట్టు(THICK HAIR) కావాలని ఉంటుంది.
మరి అలాంటి కురులు మీ సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..
ఆడ, మగ, వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికి నచ్చే అంశం కేశ సౌందర్యం.
కొన్నిసార్లు ఆరోగ్యం ఎలా ఉన్నా.. జుట్టు బాగుంటే చాలని కొందరు అనుకుంటున్న వారూ ఉన్నారు.
జుట్టు పొడవుగా, నల్లగా, షైనింగ్‌గా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారు. అయితే జుట్టు సంరక్షణ అనేది రెండు రకాల కారణాలపై ఆధారపడి ఉంటుంది.
ఒకటి చిన్నతనం నుంచి ఆహారపు అలవాట్లు, జుట్టు కోసం ప్రత్యేక సంరక్షణతో పాటు జీన్స్ ప్రభావం కూడా దీనిపై పడుతుంది.
ఈ నేపథ్యంలో జుట్టు కోసం తీసుకోవాల్సిన రోజువారి జాగ్రత్తలేవో ఒకసారి తెలుసుకుందాం.
పోషక విలువలు తప్పనిసరి
జుట్టు రాలిపోకుండా ఉండాలంటే.. ఆహారంలో పోషక విలువలు, ప్రొటీన్లు బాగా ఉండేవి తీసుకోవాలి.
ఐరన్ ఉండే పదార్థాలు జుట్టుకు మంచి చేస్తుంది. ఎర్రని క్యారెట్, బీట్రూట్తో పాటు పండ్లలో విటమిన్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
ఐరన్, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం జుట్టుకు మంచి రంగుతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మరీ మంచిది.
ఆహారపు అలవాట్లు
మాంసం, గుడ్డు తినడం వల్ల ప్రొటీన్లు పొందవచ్చు. శాకాహారులు పప్పు ధాన్యాలు తినడం వల్ల ప్రొటీన్స్ లభిస్తాయి.
అన్ని రకాల పప్పు దినుసులు తినడం లేదా రెండు, మూడు రకాలను కలిపి వండి తినడం ద్వారా జుట్టుకు మరింత శక్తి లభిస్తుంది.
వీటితో పాటు మొలకెత్తిన విత్తనాలతో ప్రొటీన్లతో పాటు అవసరమైన విటమిన్లు లభిస్తాయి.
పోషణ ముఖ్యం
ఆహారంతో పాటు జుట్టును శుభ్రంగా ఉంచడం, పోషణ అనేది సరిగా చూసుకోవాలి.
మన దేశ వాతావరణానికి అనుగుణంగా ప్రతిరోజూ తలకు నూనె రాసుకుంటే మంచిది.
ఒకవేళ తలపై ప్రతిరోజు నూనె రాసుకోవడం ఇష్టం లేని వాళ్లు ముందు రోజు రాత్రి జుట్టుకు నూనె బాగా దట్టించి.. తర్వాతి రోజు తలస్నానం చేయడం మంచిది.
అదే విధంగా తలస్నానం కోసం కేవలం కుంకుడు కాయల రసంతోనే కాకుండా అందులో ఉసిరికాయ పొడి, మెంతి పిండి, మందార పువ్వుల లేదా ఆకుల గుజ్జుతో కలిసి తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులాగా ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది.
మానసిక ప్రశాంతతతో..
వీటితో పాటు మానసిక ప్రశాంతత అనేది జుట్టుకు ముఖ్యం.
అమ్మాయిలందరూ రోజు ప్రాణాయామం చేస్తే ఒత్తిడి కాస్త దూరమవుతుంది(ఖాళీ కడుపుతో).
దీని వల్ల మనసుతో పాటు శరీరానికి ప్రశాంతత లభిస్తుంది.
ఈ ప్రభావం అనేది జుట్టు పోషణపై పడుతుంది. అంతకంటే ముఖ్యమైనది జుట్టు రాలిపోతుందని బాధ పడడం అనవసరం.
ఇలా ఆందోళన చెందడం అనేది జుట్టుకు ప్రధాన శత్రువు. జుట్టు రాలుతున్న దానిని గురించి ఆందోళన చెందకుండా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి.